క‌రోనా: ద‌ర్యాప్తు వ‌ద్దంటున్న చైనా

Garikapati Rajesh

క‌రోనాపై వుహాన్‌లో ద‌ర్యాప్తు చేయ‌డానికి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వైద్య నిపుణుల బృందాన్ని పంపిస్తోంది. కొత్త నిపుణుల‌తో వెళుతున్న ఈ బృందం జ‌రిపే ద‌ర్యాప్తే చివ‌రిది కావొచ్చ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయ‌ప‌డుతోంది. అయితే చైనా మాత్రం వుహాన్‌లో ద‌ర్యాప్తు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని వాదిస్తోంది. ఒక‌వేళ ఇక్క‌డ ద‌ర్యాప్తు చేస్తే ఇత‌ర ప్రాంతాల్లోను చేయాల‌ని డిమాండ్ చేస్తోంది. అయితే గ‌బ్బిలాల ద్వారా మాన‌వుల‌కు సంక్ర‌మించి ఉండొచ్చంటూ చెబుతున్న చైనా ఇంత‌వ‌ర‌కు దానికి సంబంధించిన పూర్తి విష‌యాల‌ను బ‌య‌ట ప్ర‌పంచానికి వెల్ల‌డి చేయ‌లేదు. చైనా ఇచ్చే స‌మాచారం మీద కొవిడ్ మూలాల‌ను చేధించ‌డం ఆధార‌ప‌డివుంటుంద‌నే విష‌యం తెలిసిందే. కానీ ఇప్ప‌టికీ ప్ర‌పంచానికి పెనుముప్పుగా క‌రోనాక‌న్నా చైనానే మారిందంటూ అంత‌ర్జాతీయ రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ను విశ్లేషించేవారు వాదిస్తున్నారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా క‌రోనా ప్ర‌పంచానికి ప‌రిచ‌య‌మై రెండు సంవ‌త్స‌రాలు కావొస్తున్నా చైనా స‌హ‌క‌రిస్తేనే మూలాల‌ను కొనుగొంటామ‌ని, లేదంటే ఇదే చివ‌రిసారి అవుతుంద‌ని చెబుతోంది. ఆపై ప్ర‌జ‌ల భారం భ‌గ‌వంతుడిపై అన్న‌ట్లుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: