ఈరోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్ధం కావట్లేదు.చాలా మంది మోసగాళ్లు ఎక్కువైపోయారు. ఇక ప్రజల భద్రతా వారి రక్షణ చూసుకోవాలిసిన పోలీసులే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.ఇక అలాంటి సంఘటనే ఇక్కడ జరిగింది.ఇక ఉద్యోగాల పేరుతో కోటి 68 లక్షలు కాజేసిన హెడ్ కానిస్టేబుల్ వైనం వెలుగు చూసింది.ఇక హైదరాబాద్ నగరంలో చీఫ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షేక్షావలి ఈ పనికి పాల్పడ్డాడు.ముఖ్యమంత్రులతో దిగిన ఫోటోలను అమాయకులకు ఆసరా గా చూపించి ఉద్యోగాల పేరుతో వల వేశాడు.
అమాయకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తా అని వారి నుంచి లక్షలు వసూలు చేశాడు ఈ హెడ్ కానిస్టేబుల్.ఇక సైబరాబాద్ లో పలు పోలీస్ స్టేషన్ లలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి.అమాయకపు ప్రజలను మోసం చేయగా వచ్చిన ఆ డబ్బు తో ఈ హెడ్ కానిస్టేబుల్ 4 లారీలు కొనడం జరిగింది.అలాగే ఫ్లాట్ కోసం బ్యాంక్ లో లోన్ కొరకు నకిలీ అడిషనల్ ఎస్పీ ఐడీ కార్డు తో మోసం కూడా చేశాడు.ఇక హెడ్ కానిస్టేబుల్ షేక్షవలి చేసిన ఈ మోసాన్ని తెలుసుకున్న నార్సింగ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చెయ్యడం జరిగింది.