మా పోరు : మ‌ళ్లీ లీడ్ లో మంచు!

RATNA KISHORE
మంచు ప్యానెల్ కు సంబంధించి ఎనిమిది మంది ఈసీ మెంబ‌ర్లుగా విజ‌యం సాధించారు. గెలిచిన వారిలో మాణిక్, హ‌ర‌నాథ్‌, బొప్ప‌న శివ‌, ప‌సునూరి శ్రీ‌నివాస్, శ్రీ‌ల‌క్ష్మి, జ‌య‌వాణి, శశాంక్, పూజిత ఉన్నారు అని నిర్థార‌ణ అయింది. మ‌రోవైపు పది మంది లీడ్స్ తో మంచు విష్ణు ప్యానెల్ ఉంది. ఎనిమిది మంది లీడ్స్ తో ప్ర‌కాశ్ రాజ్ టీం తీవ్ర పోటీలో ఉంది. తొలుత మీడియా వ‌ర్గం అందించిన స‌మాచారం అనుసారం విష్ణు ప్యానెల్ లో ఈసీ మెంబ‌ర్లుగా మాణిక్ , విజ‌య‌వాణి ముందంజలో ఉన్నారు. ఇదే ప్యాన‌ల్ లో ఉన్న శ‌శాంక్ , హ‌ర నాథ్ బాబు ముందంజలో ఉన్నారు. ఇక శివారెడ్డి ,కౌశిక్ ,సురేశ్ కొండేటి , అన‌సూయ ఈసీ మెంబ‌ర్లు గా  ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ నుంచి గెలుపు సాధించిన విష‌యం విధిత‌మే. మ‌రో వైపు కౌంటింగ్ కేంద్రంలో క్ష‌ణాల‌ను లెక్క పెడుతూ గెలుపు ఎవ‌రిదో తెలియ‌క తిక‌మ‌క ప‌డుతున్నారు అభ్య‌ర్థులు. కౌంటింగ్ ప్ర‌క్రియ జోరందుకోవ‌డంతో ఉత్కంఠ  పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్ష స్థానం ఎవ‌రిది అన్న సంశ‌యం ఇంకా వెన్నాడుతోంది. రాత్రి ప‌ది గంట‌ల త‌రువాత ఇందుకు సంబంధించి తుది ఫ‌లితం వెలువడ‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: