MAA: భ‌విష్య‌త్తులో ఇలా జ‌ర‌గ‌వు: చిరంజీవి

Garikapati Rajesh

మా ఎన్నిక‌లు భ‌విష్య‌త్తులో ఇలా జ‌గ‌ర‌కుండా చూస్తాన‌ని చిరంజీవి అన్నారు. త‌న అంత‌రాత్మ ప్ర‌భోదానుసారం ఓటేశానని, ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని, ఓటు వేస్తారా?  లేదా? అనేది వాళ్ల వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌న్నారు. కొంత‌మంది షూటింగ్స్ లో బిజీగా ఉండ‌టంవ‌ల్ల ఓటు వేయ‌లేక‌పోతున్నార‌ని, దాన్నిగురించి తాను ప్ర‌త్యేకంగా మాట్లాడేదేమీ లేద‌న్నారు. అలాగే ఓటుహ‌క్కు వినియోగించుకున్న నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ మంచు విష్ణు, ప్ర‌కాష్‌రాజ్ అన్న‌ద‌మ్ముల్లాంటివార‌న్నారు. తాను ఎవ‌రైతే బాగా చేయ‌గ‌ల‌ర‌ని భావించానో వారికే ఓటేశాన‌న్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎటువంటి విభేదాలు లేవ‌ని, అంద‌రూ క‌లిసిక‌ట్టుగా మా అభివృద్ధి కోసం, న‌టీన‌టుల సంక్షేమం కోసం ప‌నిచేస్తార‌న్నారు. ఇలా చేసేవారంద‌రికీ తాము వెన‌కుండి మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌న్నారు. ఓటేసిన మ‌రో న‌టుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ ఈ ఎన్నిక‌ల‌కు ఇంత హ‌డావిడి చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఎన్నిక‌ల అనంత‌రం అంద‌రూ క‌లిసిక‌ట్టుగానే ప‌నిచేసుకుంటార‌న్నారు. విభేదాల‌నేవి కేవ‌లం అపోహేన‌ని, అంద‌రు న‌టులు మా అభివృద్ధికి పాటుప‌డ‌తార‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

maa

సంబంధిత వార్తలు: