ప్రేయసి మోసం చేసిందని హుస్సేన్ సాగర్ లో దూకిన యువకుడు..!

ప్రేమించిన యువతి మోసం చేసిందని 23 ఏళ్ల యువకుడు హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కలకత్తాకు చెందిన 23 ఏళ్ల యువకుడు తల్లిదండ్రులతో కలిసి మౌలాలీలో నివాసముంటున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి తో యువకుడు ప్రేమలో పడ్డాడు. కొద్ది రోజులు సాఫీగానే సాగిన వీరి ప్రేమ వ్యవహారం లో కలహాలు వచ్చినట్టు తెలుస్తోంది.


దాంతో ఈ రోజు ఆర్టీసీ బస్సులో హుస్సేన్ సాగర్ మీదగా వెళ్తున్న క్రమంలో యువకుడు సడన్ గా బస్సు దిగి అదే వేగంతో పరిగెత్తి హుస్సేన్ సాగర్ లో దూకాడు. అయితే అదే సమయంలో పోలీసులు హుసేన్ సాగర్ వద్ద గస్తి కాస్తుండటం తో వెంటనే  దూకేసి యువకుడిని రక్షించి పైకి తీసుకురా క్షేమంగా బయట పడ్డాడు. ఆత్మ హత్యకు గల కారణాలు ఏంటని యువకుడిని ప్రశ్నించగా ప్రేమించిన యువతిని మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దాంతో పోలీసులు యువకుడి తల్లి తండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి ఇంటికి పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: