బిగ్ బ్రేకింగ్: డాక్టర్ సుధాకర్ విషయంలో ఏపీ సర్కార్ కు షాక్...?

గత ఏడాది నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అతను మాస్క్ ల గురించి అడిగిన తర్వాత అతన్ని కొందరు ఇబ్బంది పెట్టిన విధానం హాట్ టాపిక్ అయింది. ఇక ఇప్పుడు విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో చార్జిషీటు వేసేందుకు అనుమతి కోరింది సి.బి.ఐ. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ వేసిన సి.బి.ఐ... సుధాకర్ వ్యవహారంలో ఐదుగురు అధికారుల పాత్ర ఉందని సి.బి.ఐ నిర్ధారించింది.

అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని దర్యాప్తు సంస్థ ఈ సందర్భంగా హైకోర్ట్ దృష్టికి తీసుకు వచ్చింది. ఐదుగురు అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరుతామని హైకోర్టుకు సి.బి.ఐ స్పష్టం చేసింది. ఇక ఈ వ్యవహారంలో సి.బి.ఐ విచారణ ఉండగానే డాక్టర్ సుధాకర్ గుండెపోటు తో ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: