దర్శకధీరుడు రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్ తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ప్రకటించింది. అక్టోబర్ 21 వరకు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయని పేర్కొంది. అయితే సినిమా విడుదల తేదీ మాత్రం ఇప్పుడే ప్రకటించలేమని తెలిపింది.
కానీ వీలైనంత త్వరగా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేసింది. కరొనతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మార్కెట్ వల్ల విడుదల తేదీని, థియేటర్ల పై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేమని చెప్పింది. ఇక సినిమా విడుదల తేదీ వాయిదా పడటం తో 2022 సంక్రాంతికి విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు అజయ్ దేవ్ గన్, అలియా భట్ కూడా నటిస్తున్నారు. అంతే కాకుండా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ కూడా సినిమా లో నటించడం విశేషం.