Big Boss 5: వారి లవ్ ట్రాక్ మొదలైందిగా..

Purushottham Vinay
ఎట్టకేలకు ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. మళ్ళీ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఈసారి 5 మచ్ బెటర్ గా ఉందని చెప్పాలి. మునుపటి సీజన్ల కంటే కూడా ఈ సీజన్ చాలా రిచ్ గా వుంది. ఇక ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి గొడవలతో హీటేక్కిస్తుంది. ఆ గొడవల నుంచి ఆడియన్స్ ని కూల్ చెయ్యడానికి ఈ సీజన్లో కూడా లవ్ ట్రాక్ స్టార్ట్ అయినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. గత నాలుగు సీజన్ల నుంచి కూడా ప్రతి సీజన్లో  ఏదో ఒక లవ్ ట్రాక్ అనేది ఉంటుంది. మొదటి సీజన్లో ప్రిన్స్, దీక్ష రెండవ సీజన్లో తనీష్, దీప్తి సునైనా మూడవ సీజన్లో రాహుల్, పునర్నవి నాలుగవ సీజన్లో అఖిల్, మోనాల్ లాగానే ఈ ఐదవ సీజన్లో కూడా శ్రీ రామ్, హామీద లవ్ ట్రాక్ ఉండబోతుందని తాజాగా విడుదల అయిన ప్రోమోని చూస్తుంటే స్పష్టంగా అర్ధమైపోతుంది. చూడాలి ఇక ఈ లవ్ ట్రాక్ ఎంత దూరం వెళుతుందో..

 

https://youtu.be/vG_v7I_D684

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: