కర్ణాటక రాష్ట్రంలో ఓ యువకుడు సోషల్ మీడియా ద్వారా తన గ్రామానికి చెందిన ఇద్దరమ్మాయిలకు గాళం వేశాడు. ఆ ఇద్దరూ యువకుడి మాయలో పడి పెళ్లి చేసుకోవాలని నిశ్ఛయించుకున్నారు. చివరికి ఎవరో ఇకరినే పెళ్లాడాలి కాబట్టి చిట్టీలు వేసే వరకూ వ్యవహారం వచ్చింది. ఈ ఘటన కర్నాటకలోని హాసన జిల్లా సకలేశపుర సమీపంలోని గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువతులను సోషల్ మీడియా లో పరిచయం చేసుకుని ప్రేమించాడు.
ఆ ఇద్దరు కూడా యువకుడిని గాఢంగా ప్రేమించారు. చివరికి ఆ ఇద్దరు యువతులు కూడా తమను పెళ్లి చేసుకోవాలని యువకుడితో గొడవకు దిగారు. ఇక ఇద్దరిలో ఓ యువతి పెళ్లి చేసుకోవాలని విషం తాగి ఆస్పత్రికి తీసుకువెళగా ప్రాణాలతో భయటపడింది. దాంతో ఈ విషయం పై గ్రామంలో పంచాయితీ జరగ్గా పెద్దలు చీటిలు వేసి ఒకరిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఇద్దరు యువతుల పేర్లు చీటిల్లో రాసి తీయగా...విషం తాగిన యువతి పేరు చీటీలో వచ్చింది. దాంతో ఆ యువతితోనే పెద్దలు పెళ్లి జరిపించారు.