వివేకా హత్య కేసులో 90వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణను సాగిస్తోంది. సీబీఐ విచారణకు ఈ రోజు కమలాపురం వైసీపి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. సీఎం జగన్ మేనమామ అయిన రవీంద్ర నాథ్ రెడ్డి మొదటి సారిగా సీబీఐ విచారణకు
హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సీబీఐ వివేకా హత్య కేసులో పలువురిని విచారించింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి వివేకా హత్య అనంతరం సంచల వ్యాఖ్యలు చేశారు.
వివేకా హత్య వెనక ఎమ్మెల్సీ బీటెక్ రవి, అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉన్నారంటూ రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రవీంద్రనాథ్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచింది. ఇక ఈ కేసులో కుట్ర కోణం పై రవీంద్ర నాత్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే సీబీఐ విచారణకు ఎమ్మెల్యే హాజరవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.