ప్రధాని నరేంద్రమోడీ ఈ సెప్టెంబ్ నెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశంలో పాల్గొంటారు. ఈ సమాశేంలో వాతావరణ మార్పులు, కరోనా పరిస్థితులు మరియు ఉగ్రవాదం పై చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాకు వెళ్లారు. అంతే కాకుండా ట్రంప్ కూడా ఇండియా పర్యటనకు వచ్చారు .
కాగా బైడెన్ అధికారంలోకి వచ్చాక మోడీ మొదటి సారిగా అమెరికా పర్యటనకు వెళుతున్నారు. ఇక ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 22,27 మధ్య అక్కడే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించకున్న నేపథ్యంలో ప్రధాని అమెరికా పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ప్రధాని 2019 వ సంవత్సరంలో హౌడీ మోడీ కార్యక్రమం కోసం అమెరికాలో పర్యటించారు .