స్టార్ హీరోల అభిమానులు ఎప్పుడూ ఏదో ఒక అంశంపై సోషల్ మీడియాలో కొట్టుకుంటూ ఉంటారు. తమ హీరోల మధ్య ఎలాంటి వివాదాలు లేకున్నా ఏవో ఉన్నట్టు అభిమానులు మాత్రం నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంటారు. అయితే హీరోలు మాత్రం ఎప్పుడూ ఒకరితో ఒకరు ఎంతో స్నేహంగా ఉంటారు. ఒకరి సినిమా విజయం సాధిస్తే మరొకరు హ్యాపీగా ఫీల్ అవుతారు. టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్ బాబు పవన్ కల్యాణ్ కూడా ఎంతో స్నేహంగా ఉంటారు.
కానీ ఒక హీరో అభిమానులు మరో హీరోపై ట్రోల్స్, విమర్శలు చేస్తూ ఉంటారు. ఇక తాజాగా మరోసారి మహేశ్ బాబు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి తామంటే ఒకటే అని నిరూపించారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు..మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మహేష్ బాబు తన పోస్ట్ లో పేర్కొన్నారు.