నీటిపారుదల శాఖపై హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాధోడ్ లు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ డుమ్మా కొట్టడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నీటిపారుదల శాఖ పై ఏర్పాటు చేసిన సమావేశానికి 8మంది ఎమ్మెల్యేలు, ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. ఈ సమీక్షకు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ హాజరయ్యారు.
కానీ సమీక్షకు ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, వినయ్ భాస్కర్, సతీష్ బాబు, శంకర్ నాయక్, ఆరూరి రమేష్, ధర్మారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలంతా గైర్హాజరయ్యారు. దాంతో అభివృద్ధి, సంక్షేమ పథకాల సమీక్ష సమావేశం నిర్వహిస్తే ప్రజాప్రతినిధులకు అసలు పట్టింపు ఏది? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీఎం కార్యాలయం నుండి కార్యదర్శి హాజరుకాగా స్థానికంగా ఉండాల్సిన నాయకులు ఎక్కడ పోయారంటూ ప్రశ్నిస్తున్నారు.