సెలబ్రెటీలకు బాడీగార్డులు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరంలేదు. వారు ఇంటి నుండి కాలు బయటపెట్టాలంటే బాడీగార్డుల సపోర్ట్ ఉండాల్సిందే. లేదంటే జనాలు మీదపడి నలిపేస్తుంటారు. దాంతో ప్రతీ సెలబ్రెటీ వెంట కండలు తిరిగిన బాడీగార్డులు కనిపిస్తుంటారు. కాగా బాడీగార్డులకు జీతాలు కూడా గట్టిగానే ఉంటాయని అంటుంటారు. అయితే తాజాగా అమితాబ్ బచ్చన్ బాడీగార్డు జితేంద్ర షిండే జీతం కోటిన్నర అంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడతున్నాయి. దాంతో తాజాగా బాడీగార్డ్ జితేంద్ర షిండే స్పందించారు.
తాను ప్రస్తుతం అమితాబ్ వద్ద బాడీగార్డ్ గా పనిచేయడం లేదని స్పష్టం చేశాడు. అంతే కాకుండా తాను 2015లో అమితాబ్ వద్ద బాడీగార్డుగా చేశానని చెప్పారు. అప్పుడు తనకు అమితాబ్ అంత ఎక్కువ జీతం ఇవ్వలేదని వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. ఇక షిండే ఐదేళ్లు అమితాబ్ కు బాడీగాడ్ చేసిన తరవాత అక్కడ నుండి ముంబైలోని ఓ పోలీస్టేషన్ కు ట్రాన్సఫర్ చేశారు. ప్రస్తుతం అతడు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.