అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కరోనా డేంజర్స్ బెల్స్ మోగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో అమెరికాలో లక్షల్లో కేసులు రోజూ వేలల్లో మరణాలు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న అగ్రరాజ్యం మళ్లీ కరోనా కేసులతో కలవరడుతోంది. తాజాగా మంగళవారం అమెరికాలో ఏకంగా 2.6 లక్షల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా మళ్లీ అమెరికాలో కరోనా మరణాల సంఖ్య కూడా పెరిగిపోయింది.
ఇక ఈ వైరస్ ప్రభావం డిసెంబర్ వరకూ ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చిరిస్తున్నారు. దాంతో అమెరికా ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. మరోవైపు అమెరికాలోని 43 రాష్ట్రాలలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. ఇక గతంలో ట్రంప్ ప్రభుత్వం పై విమర్శలు కురిసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు అధికారంలో బైడెన్ ఉన్నారు. ఆయన కరోనాకు ఎలా చెక్ పెడతారో చూడాలి.