ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు లియోనార్డ్ మెస్సి తన టీమ్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన తనపై టీమ్ కోల్డ్ వాటర్ పోశారని తాను టీమ్ ను వీడుతునట్టు వెల్లడించారు. 35 ఏళ్ల మెస్సి బార్సిలోనా జట్టును విడిచి పెట్టిన తర్వాత మంగళవారం పారిస్ సెయింట్ జర్మన్ జట్టులో చేరారు. ఈ జట్టు తో మెస్సి రెండేళ్లు ఒప్పందం చేసుకున్నారు. జర్మన్ జట్టులో తన కెరీర్ ప్రారంభించడానికి సంతోషిస్తున్నా అని చెప్పారు. క్లబ్ లో ప్రతిదీ తన ఫుట్బాల్ ఆశయాలకు సరిపోతుందని అన్నారు.
ఇక్కడ మంచి జట్టుతో పాటు సిబ్బంది ఉన్నారని తెలిపారు. అర్జెంటీనాకు చెందిన మెస్సి బార్సిలోనా జట్టుతో దాదాపు రెండు దశాబ్దాల పాటు అనుబంధాన్ని కలిగి ఉన్నారు. మెస్సి కి 17 ఏళ్ళు ఉన్నప్పుడు 2004లో బార్సిలోనా క్లబ్ లో చేరాడు. ఇప్పటి వరకు మొత్తం 17 సీజన్లలో ఆడారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా క్లబ్ తరఫున 778 మ్యాచ్ లలో 674 గోల్స్ సాధించాడు మెస్సి. ఇప్పుడు జట్టును వీడటం జట్టుకు నష్టం అనే చెప్పాలి. అంతేకాకుండా జర్మన్ జట్టుతో మెస్సి క్రీడా జీవితం ఎలా కొనసాగుతుందో చూడాలి.