ఆంధ్రా ఆస్ప‌త్రిలో అరుదైన శ‌స్త్రచికిత్స‌.. !

విజ‌య‌వాడ‌లోని ఆంధ్రా ఆసుపత్రి లో అరుదైన పద్దతిలో శ‌స్త్ర‌చికిత్స చేసి డాక్ట‌ర్లు ప్రాణం కాపాడారు. ఆంధ్రా ఆస్ప‌త్రిలో అరుదైన ప‌ద్ద‌తిలో గుండె శస్త్రచికిత్స చేయ‌గా విజయవంతం అయ్యింది. నాగ వెంకట అర్జున్ అనే 15 సంవత్సరాల బాలుడు గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. అయితే ఈ నెల 4వ తేదీన “ ఓజాకీ " అనే అరుదైన పద్ధతి ద్వారా ఈ బృహద్ధమని కవాటాన్ని డా . దిలీప్ అమ‌ర్చి బాలుడి ప్రాణాన్ని కాపాడారు. తెలుగు రాష్ట్రాలలో మొదటి సారిగా ఈ ఆపరేషన్ ను విజయవంతం చేసినట్లు ఆంధ్రా హాస్పటల్ వైద్యులు ప్ర‌క‌టించారు. 

ఆంధ్రా ఆసుపత్రి వైద్యులు డాక్ట‌ర్ రామారావు మాట్లాడుతూ...గుండె లో రక్త ప్రసరణ కాకుండా  కవాటాలు మూసుకుపోయాయని తెలిపారు. అయితే అరుదుగా వచ్చే ఈ అనారోగ్యం కార‌ణంగా ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయని డాక్ట‌ర్ రామారావు అన్నారు. పిల్లలలో కవాటం మూసుకుపోయినపుడు బెలూన్ ద్వారా పెద్దది చేయటం జ‌రుగుతుంని రామారావు అన్నారు. ఇక కొంత కాలం తరువాత శస్త్ర చికిత్స నుండి ఉపశమనం లభిస్తుందని పూర్తిగా కోలుకుంటార‌ని ఆయ‌న వెల్లడించారు. ఇక అరుదైన శ‌స్త్ర‌చికిత్స చేసి విజ‌య‌వంతం అయిన డాక్ట‌ర్ దిలీప్ కుమార్ పై డాక్ట‌ర్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: