4రోజు ఒలింపిక్స్‌లో భారత్‌కు శుభారంభం..!

Chakravarthi Kalyan
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు శుభారంభం లభించింది. నాలుగో రోజు మొత్తం 10 విభాగాల్లో మన క్రీడాకారులు పోటీపడుతున్నారు. ఇప్పటికే
ఉదయం 5.30కు జరిగిన ఫెన్సింగ్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో భవానీ దేవి విజయం సాధించారు. ఉదయం 6 గంటలకు జరిగిన ఆర్చరీ పురుషుల జట్టు కూడా విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.


ఇక  ఉదయం 8.30 నుంచి టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌ ఉంటుంది. ఉదయం 9.30 నుంచి టెన్నిస్‌ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌ ఉంటుంది.  మధ్యాహ్నం 12.20 నుంచి షూటింగ్‌ పురుషుల స్కీట్‌ ఫైనల్‌ ఉంటుంది. ఈ మధ్యాహ్నం 12.45 నుంచి ఆర్చరీ పురుషుల జట్టు ఫైనల్‌ గేమ్ ఉంటుంది.మ. 12 నుంచి టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ గేమ్ ఆడతారు. ఇంకా సెయిలింగ్‌ పురుషుల లేజర్‌‍‌, సెయిలింగ్‌ మహిళల లేజర్‌‍‌ రేడియవ్, బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌, బాక్సింగ్‌ పురుషుల విభాగం,  స్విమ్మింగ్, హాకీ వంటి క్రీడాంశాల్లోనూ మనవాళ్లు ఆడతారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: