టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం

Chakravarthi Kalyan

టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం చేసింది. ఈ తెలుగు తేజం గ్రూప్‌ జే తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ముందడుగు వేసింది. ఈ మ్యాచ్‌లో ఈ స్టార్ షట్లర్ పీవీ సింధు ఇజ్రాయెల్‌కు చెందిన పోలికర్పోవా పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 21-7, 21-10 తేడాతో ఇజ్రాయెల్ క్రీడాకారిణిని పీవీ సింధు మట్టి కరిపించింది. ఆట ఆసాంతం తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది పీవీ సింధు.


గతంలో ఇప్పటికే ఓసారి ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పీవీ సింధుపై భారత్ చాలా ఆశలు పెట్టుకుంది. స్వర్ణం సాధించే అవకాశం ఉన్న క్రీడాకారుల్లో పీవీ సింధు ఒకరుగా చెప్పొచ్చు. ఇక మిగిలిన క్రీడల విషయానికి వస్తే..  ఇప్పటికే షూటింగ్, ఆర్చరీ అంశాల్లో సదరు క్రీడాకారులు నిరాశ పరుస్తున్నారు. ఈ రెండు అంశాల్లోనూ ఎక్కువ పతకాలు వస్తాయని భారత్ ఆశిస్తోంది. చూడాలి ఏంజరుగుతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: