ఇవాళ ఖానామెట్‌లో భూముల వేలం..

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ శివార్లలోని భూముల అమ్మకం తెలంగాణ సర్కారుకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే కోకాపేట భూముల వేలంతో ప్రభుత్వానికి కోట్లు సమకూరాయి. ఇవాళ ఖానామెట్‌లోని 15 ఎకరాల భూమికి ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నారు. ఈ భూమికి ఎకరానికి కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించింది ప్రభుత్వం. ఈ భూములను కనీస ధరకు అమ్మినా రూ.1,600 కోట్లు వరకూ వస్తాయని అధికారులు  అంచనా వేస్తున్నారు. ఈ భూములు ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ ద్వారా వేలం వేస్తారు.

గురువారం నాటి కోకాపేట ఈ-వేలానికి భారీ స్పందన వచ్చింది. ప్లాట్లు దక్కించుకునేందుకు ప్రముఖ సంస్థలు పోటాపోటీగా ధర పెంచుకుంటూ వెళ్లాయి. 1.65 ఎకరాల ప్లాట్‌ కోసం తీవ్రంగా  పోటీ  పడ్డారు. మొత్తం 50 ఎకరాలను అమ్మకానికి పెడితే.. రూ. 2 వేల కోట్ల వరకూ ప్రభుత్వానికి  ఆదాయం వచ్చింది. అత్యధికంగా ఎకరా రూ. 60 కోట్లు ధర పలికింది. యావరేజ్ మీద ఒక్కో ఎకరం 40 కోట్లు పలికింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: