ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్..ఆన్లైన్ సేవలు బంద్ !

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు కీలక సూచన చేసింది. పలు నిర్వహణ సేవల కారణంగా ఈ రోజు రాత్రి 10:45 నుండి రేపు ఉదయం 0:15 గంటల మధ్య సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు పని చేయమని ఎస్బిఐ తెలిపింది. అంటే దాదాపు గంటన్నర పాటు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపివేస్తున్నట్టు ఎస్బీఐ స్పష్టం చేసింది. కస్టమర్లు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.


గంటన్నర పాటు ఎస్బిఐ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కస్టమర్లు ఎలాంటి  అత్యవసరమైన లావాదేవీలు ఉన్నా ఆ సమయం లోపు పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా యుపిఐ సేవలపై ఆధారపడేవారు దీనిని గమనించి ముందుగానే తమ లావాదేవీలను పూర్తి చేసుకోవడం మంచిది.  లేదంటే 10:45 తర్వాత గంటన్నరపాటు లావాదేవీలు జరపాలంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: