తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) తమ సేవా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. దేవాలయం అభివృద్ధి కొరకై టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో టిటిడి దేవస్థానాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకోబోయే వధూవరులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది.
పెళ్లి నిశ్చయం అయిన తర్వాత మొదటి శుభలేఖ పంపిస్తే తిరుమల తిరుపతి నుండి దంపతులకు కంకణాలు, అక్షంతలు, వివాహం గురించి తెలిపే పుస్తకం, కుంకుమ ప్రసాదం, శ్రీవారి ఆశీర్వచనాలతో కూడిన బహుమతిని పంపిస్తామని ప్రకటించింది. దీనికోసం శ్రీ లార్డ్ వెంకటేశ్వర స్వామి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్.. కె టి రోడ్డు తిరుపతి అడ్రస్ కు నెల ముందు శుభలేఖ పంపించాలని కోరింది. టిటిడి తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలో ఎక్కడ ఉన్నా కొత్తగా పెళ్లి చేసుకునే జంటకు స్వామి వారి ఆశీర్వాదం లభిస్తుంది.