బ్రేకింగ్ : జమ్మూ ఎయిర్ పోర్ట్ లో పేలుళ్లు..ఉగ్రవాది అరెస్ట్ !

జమ్మూ విమానాశ్రయంలో పేలుళ్లు సంభవించాయి. విమానాశ్రయం లోపల ఒక్కసారిగా భారీ శబ్ధంతో వినిపించడం తో అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్ట్ లో ని టెక్నికల్ ఏరియాలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటన అనంతరం సెక్యూరిటీ సిబ్బంది ఫోరెన్సిక్ నిపుణులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు డిస్పోజల్ టీమ్ కూడా ఇప్పుడే ఎయిర్ పార్ట్ కు చేరుకుంటోంది.

ఇదిలా ఉండగానే ఓ ఉగ్రవాదిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. నర్వాల్ ఏరియాలో తీవ్రవాది అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఐదు కేజీల ఎల్ఈడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తీవ్రవాదిని పోలీసులు విచారిస్తున్నారు. ఐదు కేజీల ఎల్ఈడీ తో ఉగ్రవాదులు పేలుళ్లకు ఏమైనా పథకం రచించారా అన్నదానిపై విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో జమ్మూ కాశ్మీర్ మొత్తం ఒక్కసారిగా అలర్ట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: