కట్నం కోసం వేధిస్తున్నారా.. అయితే ఇలా చేయండి.. !

టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినా మనుషుల తీరు మాత్రం మారడం లేదు. మహిళలకు సమాజంలో ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా వయసు వచ్చాక పెళ్లి చేయాలంటే తల్లి తండ్రులు కట్నం ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇద్దరూ కలిసి పనిచేస్తూ సంపాదిస్తున్నా మగవాళ్ళు కట్నం పుచ్చుకోవడం లో మాత్రం తగ్గేదెలా అంటున్నారు. అంతే కాదు కట్నం తీసుకురాక పోతే దాడులు చేస్తూ..కొన్ని సార్లు హత్యలు చేయడం కూడా చూస్తూనే ఉన్నాం.

ఇక మరింకొందరు మహిళలు వరకట్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా వరకట్న వేధింపులకు చెక్ పెట్టేందుకు కేరళ ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం 24 గంటల హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. కేరళ రాష్ట్రం కొల్లం జిల్లా లో ఓ మహిళ వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. దాంతో మహిళలను వేధింపుల నుండి నుంచి రక్షించేందుకు ప్రభుత్వం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. 24 గంటలు హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: