ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ ఈ రోజు ప్రారంభమైంది. తొలి రోజు ఆట వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. ఇక రెండో రోజు కీవీస్ కోరిక మేరకు భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం భారత జట్టు వికెట్ కోల్పోకుండా 62 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్, శుభమన్ గిల్ ఇద్దరు నిలకడగా ఆడుతున్నారు. రోహిత్ 6 ఫోర్లు, గిల్ 3 ఫోర్లు బాదారు. ఇదిలా ఉంటే ఈ రోజు మృతి చెందిన భారత పరుగుల వీరుడు, ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ గౌరవార్థం భారత క్రికెటర్లు నల్ల బ్యాండ్ లను ధరించి మ్యాచ్ ఆడుతున్నారు. మిల్కాసింగ్ భారత క్రీడా రంగానికి ఎంతో సేవ చేయడంతో పాటు ఆయన జీవితం ప్రపంచ క్రీడాకారులు అందరికి ఆదర్శం అన్న సంగతి తెలిసిందే.