కేంద్రం ట్విట్టర్ ను టార్గెట్ చేసినప్పటి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కుంటోంది. తాజాగా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, కాంగ్రెస్ నేతలు, పలువురు జర్నలిస్టులపై ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలు ఏమైందంటే ఈ నెల 5న అబ్దుల్ సమద్ అనే వృద్ధుడి మీద కొంత మంది దాడి చేసి అతని గడ్డాన్ని తీసివేసి, వందేమాతరం, జై శ్రీరామ్ అనాలని బలవంతం చేసినట్లు ఓ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసినందుకు ఆన్లైన్ న్యూస్ పోర్టల్ 'ద వైర్' జర్నలిస్టులు రానా అయ్యుబ్, సభా నఖ్వీ, మహ్మద్ జుబీర్లతో పాటు వాటిని షేర్ చేసిన కాంగ్రెస్ నేతలు సల్మాన్ నిజామీ, శామా మహ్మద్, మస్కూర్ ఉస్మానీ ఇలా మొత్తం మీద ట్విట్టర్ సహ తొమ్మిది మంది మీద ఎఫ్ఐఆర్ నమోదైంది.