తనిఖీలకు వెళ్లరూం.. సొమ్ము కాజేశారు

Chandu
సారా తనిఖీలకు వెళ్ళిన పోలీసులు.. తాళాలు వేసి వున్న రెండు ఇండ్లల్లో చోరికి యత్నించారు. సుమారు 8లక్షల విలువైన నగదుతో పాటు బంగారాన్ని కాజేయాలనుకున్నారు. విషయం తెల్సుకున్న పోలీస్ ఉన్నతాధికారులు సదరు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేసింది. రక్షణగా వుండాల్సిన పోలీసులే సొమ్ములకు ఆశపడి దొంగతనం చేయాలనుకోవడం దురదుష్టకరమని బాధితులు వాపోయారు. తమ సొమ్మును తీసుకెళ్ళవద్దని అడ్డుకున్న పోలీసులు వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు విషయాన్ని ఏ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.
తమిళనాడులోని వేలూరు జిల్లాలో గల నాచ్చంబట్టు  అటవీ ప్రాంతంలో సారా కాస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో సిబ్బంది తో కలిసి అరియార్ ఎస్సై ఘటన స్థలానికి వెళ్ళాడు. తనిఖీలకు వచ్చిన పోలుసులను చూడగానే.. సారా కాసేవారు భయం తో పరుగులు తీశారు. ఘటన స్థలం నుంచి పారిపోయారు. ఈ క్రమంలో అక్కడి వున్న ఇండ్లల్లో తనిఖీలు చేశారు. సారా తయారీకి సంబంధించి ఉపయోగించే వస్తువులను పోలీసు సిబ్బంది ధ్వంసం చేశారు. అక్కడే వున్న ఇండల్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. రెండు ఇండ్లు తాళం వేసి కనిపించాయి. దీంతో వారు తలుపులు పగుల గొట్టి తనికీలు చేస్తుండగా.. 8 లక్షల నగదు కన్పించింది. దాంతో పాటు బంగారం కూడా అక్కడ వున్నది. దీంతో సదరు పోలీసుల కన్ను వాటిపై పడింది. అక్కడ స్థానికులు లేకపోవడంతో వాటిని కాజేయాలని  సిబ్బంది యత్నించింది. గమనించిన స్థానికులు వారిని అడ్డుకున్నారు. తమ సొమ్మును తీసుకుపోవడం సరికాదని వారితో వారించారు. అయినప్పటికీ పోలీసులు వినలేదు. దీంతో ఈ విషయాన్ని గ్రామస్థులు ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. సదరు సిబ్బంది పై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. విచారణ జరిపిన ఏఎస్పీ సదరు సిబ్బందిని సస్పెండ్ చేశారు. వారిపై కేసు కూడా నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: