ట్విట్టర్ ను నైజీరీయా దేశం ఛీ కొట్టింది. నైజీరియా దేశ అధ్యక్షుడు బుహారీ చేసిన ట్వీట్ ను ట్విట్టర్ తొలగించింది. దాన్ని తీవ్రంగా పరిగణించిన నైజీరియా ప్రభుత్వం ట్విట్టర్ కర్యకలాపాలను దేశంలో నిరవధికంగా నిలిపివేసింది. నైజీరియాలో మైక్రోబ్లాగింగ్ మరియు సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ ట్విట్టర్ కు సంబంధించిన కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు సమాచార మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అధ్యక్షుడు బుహారీ బుధవారం నైజీరియాలో 1967-1970 మధ్య 30 నెలల అంతర్యుద్ధం గురించి ప్రస్తావించారు. అయితే అధ్యక్షుడి పోస్టు ట్విట్టర్ నిబంధనలకు విరుద్దంగా ఉందన్న కారణంతో ట్విట్టర్ ఆయన ట్విట్ ను తొలగించింది.