దేశంలోని ప్రధాన దేవాలయాలు ఇప్పుడు కోవిడ్ సెంటర్లుగా మారిపోయాయి. కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేలాదిమంది రోగులు ఇప్పుడు ఆలయాల్లో ఆశ్రయం పొందుతున్నారు. చికిత్స పొందుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా విజృంభిస్తున్న వేళ ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రాలు కరోనా రోగులకు బాసటగా నిలుస్తున్నాయి. ఇక హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ లోని విశ్వనాథాలయం కోవిడ్ పేషెంట్లకు నిరంతర అన్నవితరణ చేస్తోంది. గుజరాత్ లోని బోటాడ్ జిల్లాలోని ప్రసిద్ధి సారంగ్ పూర్ హనుమాన్ మందిరం కూడా దాని ధర్మశాలను 100 పడకల ఆస్పత్రిగా మార్చింది. ఢిల్లీలోని రాధాస్వామి సత్సంగ్ మందిరాన్ని కోవిడ్ సెంటర్‌గా మార్చిన విషయం తెలిసిందే. ఇక ఒరిస్సాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ మందిరానికి చెందిన నీలాచల్ భక్త నివాస్ ను కోవిడ్ సెంటర్ గా మార్చాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. 120 పడకలతో ఇతర అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసిఅందుబాటులోకి తేనున్నారు. ముంబైలోని కందివాలిలోని పవన్ ధామ్ ఆలయం తన నాలుగంతస్తుల భవనాన్ని 100 పడకలతో కూడిన కోవిడ్ సెంటర్ గా మార్చేసింది. 50 పడకలకు ఆక్సిజన్, అక్కిమీటర్లు, పల్స్ మీటర్లు, బీపీ మిషన్లు. మానిటర్ మిషన్లు సిద్ధం చేశారు.