భారత్ లో క్రమక్రంగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడం తో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,67,246 కొత్త కేసులు నమోదు కాగా గత మూడు రోజులుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఇక యాక్టీవ్ కేసులు సైతం కాస్త తగ్గడంతో వైద్య, ఆరోగ్య అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అంతే కాదు కొత్త కేసుల తో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతుండటం విశేషం.