ప్రముఖ యూట్యూబ్ యాంకర్, జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్ కరోనాతో కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట ఆయన కరోనా బారినపడగా, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. యూట్యూబ్ వేదికగా ఎంతో మంది సినిమా ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశారు. అతిథిలు సైతం ఆశ్చర్యపోయేలా ఆయన సంధించే ప్రశ్నలు సూటిగా ఉండేవి. అంతేకాదు, నటుడిగానూ టీఎన్‌ఆర్ తనదైన ముద్రవేశారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. టీఎన్‌ఆర్ అసలు పేరు తుమ్మల నరసింహారెడ్డి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు ప్రార్ధిస్తున్నారు. TNR ఇటీవల వచ్చి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంలోను ఓ ముఖ్య పాత్రలో కనిపించి అలరించారు. కత్తి మహేష్.."స్క్రీన్ షేర్ చేసుకున్నాం. స్టేజ్ షేర్ చేసుకున్నాం. కలిసినప్పుడల్లా, 'నీతో అందరూ ఇంటర్వ్యూలు చేసేసారు. నేను ఎప్పుడో చేస్తాను. అది చాలా స్పెషల్‌గా ఉండాలి, ఉంటుంది' అనేవాడు. దర్శకుడు అవుదామని వచ్చాడు. ఇరవైఏళ్లుగా ఏవేవో చేసాడు. ఇంటర్వ్యూయర్‌గా చాలా ఫేమస్ అయ్యాడు. సినిమాల్లో యాక్టర్‌గా విజృంభణలో ఉన్నాడు. త్వరలో దర్శకత్వం అన్నాడు. కానీ ఇలా ఈ లోకం విడిచి వెళ్లాడు"అని ఆవేదన చెందాడు.
TNR మరణవార్త తెలిసి హీరో నాని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. "TNR కన్నుమూశారని తెలిసి షాకయ్యా. ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి వారి మనసులో మాటలను జనానికి వినిపించిన ఆయన మరణం బాధాకరం" అని నాని పేర్కొన్నారు.