కనికరం లేని కరోనా.. ఆసుపత్రిలో ఏకంగా..!!

Madhuri
కోవిడ్-19ను కట్టడి చేసేందుకు మరిన్ని కఠిన చర్యలను అమలు చేయబోతున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో కరోనాను అరికట్టేందుకు ఢిల్లీలోని కేజ్రీవాల్ ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో లాక్‌డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లాక్‌డౌన్‌ను మ‌రో వారం రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ ఆదివారం వెల్లడించారు. అయితే ఈసారి ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠిన‌తరం చేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు.మరోవైపు..ఢిల్లీలోని సరోజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో గత నెల రోజుల్లో 80 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది.వ్యాక్సిన్ తీసుకున్న ఏ.కె. రావత్ అనే డాక్టర్ నిన్న మరణించారు. ఏప్రిల్-మే నెలల మధ్య 80 మంది మెడికల్ స్టాఫ్ పాజిటివ్ కి గురయ్యారని, శనివారం మరణించిన డాక్టర్ రావత్ తన జూనియర్ అని ఈ ఆసుపత్రి చీఫ్  మెడికల్ ఆఫీసర్ డా. పి.కె.భరద్వాజ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: