ఈటెల భ‌ర్త‌ర‌ఫ్‌తో టీఆర్ఎస్‌కు ఆ కులం ఓట్లు దూర‌మైన‌ట్టే ?

VUYYURU SUBHASH

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాజీ మాత్యులు ఈటెల రాజేందర్ ముదిరాజ్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే బర్తరఫ్ చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్‌లు కేసీఆర్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బీసీల్లో బ‌ల‌మైన నాయ‌కుడిగా స్వ‌యంశ‌క్తితో ఎదిగిన ఈటెల‌ను ఇంత ఘోరంగా అవ‌మానించ‌డం ఎంతవరకు సమంజసమని ముదిరాజ్ సంఘాల నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. టిఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నో భూ కుంభకోణాలు చేసినా... వారిని పట్టించుకోకుండా బీసీ వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేయడంలో ఆంతర్యమేమిటని సంఘాల నేత‌లు కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర వ్యాప్తంగా వారు కేసీఆర్ దిష్టిబొమ్మ‌లు ద‌హ‌నం చేయ‌డంతో పాటు కేసీఆర్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: