ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప అస్వస్థతతో ఉన్న ఆయన కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆయన శ్రీకాకుళం లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన సతీమణి వాణిశ్రీ కూడా కరోనా భారిన పడ్డారు. ఆమె కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమతో కాంటాక్ట్ అయిన వాళ్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలని తమ్మినేని సీతారాం కోరారు.