ఏపీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు, నెల్లూరు జిల్లాలో నాలుగు సెగ్మెంట్లలో ఈ నియోజకవర్గం విస్తరించి ఉంది. ఇప్పటి వరకు అక్కడ 9వ రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 9వ రౌండ్ పూర్తయ్యే సరికి వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి 76 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం పోలయిన 10 లక్షల ఓట్లలో 3 లక్షల ఓట్లు లెక్కించారు. వైసీపీకి 1.76 లక్షల ఓట్లు రాగా, టీడీపీకి లక్ష ఓట్లు వచ్చాయి.