ప్ర‌పంచంలో వీళ్ల‌కే కోవిడ్ ముప్పు ఎక్కువా... రీజ‌న్ ఇదే ?

VUYYURU SUBHASH
కోవిడ్ భారినపడిన ఊబకాయులకు రిస్క్‌ ఎక్కువని ఓ అధ్యయనం తేల్చింది. కోవిడ్‌–19 సోకిన ఊబకాయులు ఐసీయూల్లో చేర‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని.. వీరు కోవిడ్ ముప్పు ఎక్కువుగా ఎదుర్కొంటున్నార‌ని తాజా అధ్య‌య‌నం చెప్పింది. తాజాగా లాన్సెట్‌ డయాబెటిస్, ఎండోక్రైనాలజీ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. కోవిడ్ ముప్పుకు, శ‌రీర బ‌రువుతో ఎక్కువ లింక‌ప్ అయ్యి ఉంద‌ని ఈ అధ్య‌య‌నం చెప్పింది. ఇంగ్లండ్‌లోని 69 లక్షల మంది ప్రజలతోపాటు కోవిడ్‌తో ఆస్పత్రి పాలైన 20 వేల మంది బాధితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చామని పరిశోధకులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: