ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయి. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా మరోసారి ఏపీలో లాక్ డౌన్ తప్పదా ? అన్న సందేహాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుల తీవ్రత నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడలో కలెక్టర్లదే కీలక పాత్ర అని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. కరోనా కట్టడికి బాధ్యత అంతా కలెక్టర్లదే అని జగన్ తేల్చి చెప్పారు. ఇక కోవిడ్ ఆసుపత్రుల్లో సౌకర్యాలను కలెక్టర్లు దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు జిల్లాల్లో శానిటైజేషన్ చేయించాలని, ప్రజలు మాస్క్ లు, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు.