క‌ని క‌రోనా: భార‌త్‌లో కోవిడ్ క‌ల్లోలం.. ఆ దేశం కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

VUYYURU SUBHASH
క‌రోనాతో పోరాడుతూ సంక్లిష్ట స్థితిలో ఉన్న భార‌త్‌కు ప‌లు దేశాలు అండగా ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే భార‌త్‌కు ప్ర‌త్యేక సాయం అందిస్తున్న‌ట్టు జర్మనీ ఛాన్సలర్ యాంజెలా మెర్కెల్ ప్రకటించారు. కరోనా కారణంగా భారత ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. ఈ సందర్భంగా నేను వారికి సంఘీభావం తెలుపుతున్నాను. కరోనాపై యుద్ధం చేయ‌డం అనేది ఏ ఒక్క‌రిదో కాద‌ని.. అది ఉమ్మ‌డి పోరాటం అని... ఈ విష‌యంలో తాము భార‌త్‌కు పూర్తి స్థాయిలో అండ‌గా ఉంటామ‌ని చెప్పారు. ఈ విషయాన్ని ఛాన్సలర్ అధికార ప్రతినిధి సోష‌ల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సహాయ కార్యక్రమం ఏ రూపంలో ఉంటుందనేది దానిపై జర్మనీ ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. అయితే..ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణకు సహాయపడాలంటూ జర్మనీ సైన్యాన్ని భారత్ కోరినట్టు జర్మనీ వర్గాలు తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: