క‌ని క‌రోనా: విజ‌య‌వాడ ప్ర‌భుత్వాసుప‌త్రిలో క‌రోనా దారుణాలు

VUYYURU SUBHASH
క‌రోనా చావు బతుకుల పోరాటంగా మారింది. వైరస్ భారిన పడి ఊపిరాడక బాధితులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ప్రాణ‌వాయువు ఆక్సిజ‌న్ దొర‌క్క ప్రాణాలు అర‌చేత ప‌ట్టుకుని మ‌రీ ఆసుప‌త్రుల‌కు ప‌రుగులు పెడుతున్నారు. పేద‌ల బాధ‌లు అయితే వ‌ర్ణ‌నాతీతం. ఇక విజ‌య‌వాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఆక్సిజన్‌, బెడ్‌ల కొరతతో కరోనా రోగుల తీవ్ర అవస్ధలు పడుతున్నారు. బెడ్‌ల కోసం ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులతో రికమండేషన్‌లు చేస్తున్నా.. బెడ్లు దొరకడం లేదు.

ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. అక్క‌డ చికిత్స పొందుతోన్న రోగి చ‌నిపోతేనే బెడ్ ఖాళీ అవుతోంది. ఇక సాధార‌ణ రోగుల‌ను చివ‌ర‌కు గుంటూరు పంపించేస్తున్నారు. ఓపీలు ర‌ద్దు చేసినా కూడా అక్క‌డ ర‌ద్ది మాత్రం ఆగ‌డం లేదు. ప్ర‌భుత్వం మూడు గంట‌ల్లోనే బెడ్లు కేటాయిస్తామ‌ని చెపుతున్నా బెడ్లు రోజుల త‌ర‌బ‌డి కూడా దొర‌క‌డం లేదు. పేద‌ల బాధ‌లు అయితే చెప్ప‌లేనివిగా ఉన్నాయి. అక్క‌డ వారి బాధ‌లు హృద‌య విదార‌కంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: