విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కొత్త అప్‌డేట్ ఇదే

VUYYURU SUBHASH
ఆంధ్రుల క‌ల‌ల హ‌క్కు అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర‌సిస్తూ కొద్ది రోజులుగా విశాఖ‌లో ఉద్య‌మం న‌డుస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోయినా కార్మిక సంఘాలు మాత్రం త‌మ ఆందోళ‌న ఆప‌డం లేదు. ఈ క్ర‌మంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను మే నెల 7వ తేదీన బంద్ చేయాలని అఖిలపక్షం నిర్ణయించింది. తాము ఎంత‌గా పోరాటం చేస్తున్నా ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మేనెల 7వ తేదీన బంద్ చేయాలని నిర్ణయించింది. ఈ బంద్ కుఅందరూ సహకరించాలని కోరింది. ఇక ఇప్ప‌టికే కొద్ది రోజుల క్రితం చేప‌ట్టిన ఏపీ బంద్‌కు వైసీపీ కూడా మ‌ద్ద‌తు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: