దేశ రాజధాని ఢిల్లీలో ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. మరోవైపు దోమకాటు కారణంగా వచ్చే డెంగ్యూ వైరల్ జ్వరాల కేసులు హెచ్చుమీరుతున్నాయి. ఇప్పటికే మూడేళ్ల రికార్డును డెంగ్యూ బద్దలు కొట్టింది. మొత్తం డెంగ్యూ కేసులు 50కు పైగానే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చిన 22మంది రోగులు డెంగ్యూ చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
అయితే డెంగ్యూ అనేది నిర్దిష్ట చికిత్స లేదా వ్యాక్సిన్ లేని వైరల్ వ్యాధి కాబట్టి ప్రతీ ఒక్కరు దోమలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. 1996 నుంచి ప్రతీ సంవత్సరం జూలై, నవంబర్ మధ్య ఢిల్లీ డెంగ్యూ మహమ్మారి బారిన పడుతోంది. ఇప్పటికే ఢిల్లీని కరోనా గజగజా వణికిస్తోంది. ఈ క్రమంలో దీనికి డెంగ్యూ కూడా తోడు అయితే ఢిల్లీ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.