మళ్లీ వివాదంలో చిక్కుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే... కేసీర్ వార్నింగ్ భేఖాతార్..!
అయితే మసీదు నిర్మించే ధార్మిక సంస్థ సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ క్రమంలోనే ముత్తిరెడ్డి సునీతతో పాటు కాలనీ వాసులను క్యాంపు కార్యాలయానికి పిలిపించడంతో పాటు తనను ఇంట్లో కూర్చో.. బయట కనిపిస్తే బాగోదని బెదిరించారని ఆమె ఫిర్యాదు చేసింది. అయితే తాను ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని సూచించానే తప్పా.. బెదిరించలేదని ముత్తిరెడ్డి చెపుతున్నారు.