ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా కరోనా కేసులు, మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూ వస్తోంది. తాజా లెక్కల ప్రకారం ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 9,48,231కు చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 35,592గా ఉన్నాయి.. ఇప్పటి వరకు 9,05,266 మంది రికవరీ కాగా.. 7,373 మంది కోవిడ్‌తో మృతిచెందారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు చోట్ల స్థానికంగానే లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో ప్రధాన పట్టణాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. బొబ్బిలిలో పాక్షిక లాక్ డౌన్ విధించారు అధికారులు. ఇందులో భాగంగా మధ్యాహ్నం రెండు గంటల నుండి వ్యాపార సంస్థలు మూసివేయనున్నారు. రేపటి నుంచి కురుపాంలో పాక్షిక లాక్ డౌన్ ఉండనుంది. అలాగే సోమవారం నుండి పార్వతీపురంలో మధ్యాహ్నం లాక్ డౌన్ విధించనున్నారు.