తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ , జనసేన అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఇప్పటికే రత్నప్రభకు మద్దతుగా తిరుపతి బహిరంగ సభలో పాల్గొని ప్రచారం కూడా చేసిన పవన్ తాజాగా ఆమెను గెలిపిస్తే... కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెచ్చే సత్తా ఆమెకే ఉందని అభిప్రాయ పడ్డారు.
ఈ మేరకు ఆయన తిరుపతి ఓటర్లకు ఓ లేఖ కూడా రాశారు. తిరుపతి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే రత్నప్రభతోనే సాధ్యమవుతుందని ... ఆమె ఐఏఎస్ అధికారిగా పనిచేయడంతో ఆమెకు ప్రజల సమస్యలు తెలుసునన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు వారి పార్టీ పెద్దల సేవలోనే తరిస్తారని పేర్కొన్నారు.