పోలీస్‌స్టేషన్లో లొంగిపోయిన టీడీపీ కీలక నేత
ఇక్కడ పోలీసులు తమపై దాడి చేసిన వారిపై కాకుండా గాయపడ్డ తమ పార్టీ నేతలను అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారంటూ కూన రవి ఫైర్ అయ్యారు. పోలీసులతో పాటు డీఎస్పీ తీరును విమర్శించారు. విధినిర్వహణలో వున్న డీఎస్పీ సహా పోలీసుల పట్ల దుర్భాషలాడిన ఘటనలో 29 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న రవి ఈ రోజు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు.