తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు... రేపే నోటిఫికేష‌న్‌...!

VUYYURU SUBHASH
తెలంగాణ‌లో వ‌రుస ఎన్నిక‌ల జాత‌ర కంటిన్యూ అవుతోంది. రేపు మ‌రో ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ రానుంది. నోటిపికేష‌న్ వ‌చ్చిన 14 రోజుల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పోరేష‌న్ల‌తో పాటు సిద్ధిపేట‌, జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, అచ్చంపేట‌, న‌కిరేక‌ల్ మున్సిపాల్టీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తారు. గ‌తేడాది తెలంగాణ‌లో మున్సిపాల్టీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే కోర్టు కేసులు, పాల‌క వ‌ర్గాల గ‌డువు తీర‌క‌పోవ‌డంతో వీటికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు. దీంతో ఇప్పుడు ఇక్క‌డ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నారు. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో నిబంధ‌న‌లు అనుస‌రిస్తూ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: