భార‌త్‌లో సెకండ్ వేవ్ జోరుకు ఇదే కార‌ణ‌మా ?

VUYYURU SUBHASH
భారత్‌లో సెకండ్‌ వేవ్‌ ఉధృతి జోరుగా పెరిగిపోతోంది. ఓ వైపు దేశంలో క‌రోనా వ్యాక్సిన్ వేస్తున్నా.. ఈ ప్ర‌క్రియ మంద‌కొండిగా సాగుతుండ‌డంతో పాటు ప్ర‌జ‌లు క‌రోనా భ‌యాన్ని వ‌దిలేసి... నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డం కూడా క‌రోనా ఉధృతికి కార‌ణ‌మ‌వుతోంది. రెండు మ్యుటేషన్లతో కూడిన కొత్త రకం కరోనా కేసులు దేశంలో బయల్పడడం వంటివెన్నో కేసుల్ని పెంచిపోషిస్తున్నాయని వైరాలజిస్టులు చెబుతున్నారు.

ఇక ఇటీవ‌ల ప్ర‌జ‌ల్లో నిర్ల‌క్ష్యం కూడా పెరిగిపోయింది. ఎవ‌రికి వారు భౌతిక దూరం పాటించ‌డం లేదు సరిక‌దా ?  క‌నీసం మాస్కులు కూడా పెట్టుకోవ‌డం లేదు. ఇవే కేసులు పెరిగిపోవడానికి ప్రధాన కారణమేనని వైరాలజిస్టులు చెపుతున్నారు. కరోనా కొత్త మ్యూటెంట్లపై వ్యాక్సిన్‌ ఎలా పని చేస్తుందన్న దానిపైనే భారత్, ప్రపంచ దేశాల భవిష్యత్‌ ఆధారపడి ఉందని వారు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: