మరో రాష్ట్రం బీజేపీ చేజారుతోంది... లోకల్లో ఘోర పరాభవం
ఇక్కడ మొత్తం 28 స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీఐపీఆర్ఏ 18 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ 9 స్థానాలతో సరిపెట్టుకోగా, దాని మిత్రపక్షమైన ఐపీఎఫ్టీకి ఒక్క స్థానమూ దక్కలేదు. స్వతంత్ర అభ్యర్థి ఒక్క స్థానంలో గెలుపొందాడు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడు దశాబ్దాల పాటు సీపీఎంకు పెట్టని కోటగా ఉన్న ఈ రాష్ట్రాన్ని బీజేపీ అనేక ప్రలోబాలతో హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.