ఛ‌త్తీస్‌ఘ‌డ్ ఎన్‌కౌంట‌ర్లో ఇద్ద‌రు ఏపీ జ‌వాన్లు మృతి... మ‌రో నెల‌లో పెళ్లి

VUYYURU SUBHASH
ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బీజాపూర్ జిల్లాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్లో ఇద్ద‌రు తెలుగు జ‌వాన్లు మృతి చెంద‌డం బాధాక‌రం. వీరిద్ద‌రు కూడా కోబ్రా ద‌ళానికి చెందిన జ‌వాన్లు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన శాఖమూరి మురళీకృష్ణ, విజయనగరం దిగువ వీధికి చెందిన రౌతు జగదీశ్ అనే ఇద్దరు జ‌వాన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. జగదీష్ మృతితో గాజులరేగ లో విషాదం నెలకొంది.. మే 22న జగదీష్ వివాహం కూడా నిశ్చయం అవ్వ‌డంతో బంధువులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

శాఖమూరి మురళీకృష్ణ మృతితో గుంటూరు జిల్లాలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి మురళీకృష్ణ సీఆర్పిఎఫ్ లో ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. ఇక ఈ భీక‌ర దాడిలో ఇప్ప‌టి వ‌ర‌కు 24 మంది మృతి చెందారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: