బెంగ‌ళూరు డ్ర‌గ్స్ కేసు: ఈ న‌లుగురు తెలంగాణ ఎమ్మెల్యేల‌కు నోటీసులు

VUYYURU SUBHASH
క‌ర్ణాటక‌తో పాటు తెలంగాణ‌లోనూ సంచ‌ల‌నం రేపుతున్న బెంగ‌ళూరు‌ డ్ర‌గ్స్ కేసు విచారణ వేగ‌వంతంగా సాగుతోంది. ఈ డ్ర‌గ్స్ కేసులో బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు, సినీ ప్ర‌ముఖుల‌తో పాటు ప‌లువురు రాజ‌కీయ నేత‌ల‌కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేయ‌నున్నారు. పార్టీ జ‌రిగిన ప్ర‌దేశంలో సీసీ ఫుటేజ్ లేక‌పోయినా.. హెట‌ల్ గేట్ వ‌ద్ద ఉన్న సీసీ కెమేరాల ఆధారంగా న‌లుగురు తెలంగాణ ఎమ్మెల్యేల‌ను పోలీసులు గుర్తించిన‌ట్టు తెలుస్తోంది. అయితే వీరు పార్టీకి వెళ్లినా డ్ర‌గ్స్ తీసుకున్నారా ? లేదా ? అన్న‌ది క్లారిటీ లేక‌పోయినా .. స‌రైన సాక్ష్యాలు ఉంటే విచార‌ణ‌కు హాజ‌రయ్యేందుకు నోటీసులు జారీ చేసేలా పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: